KA Paul : అసెంబ్లీకి వెళ్లకుంటే.. రిజైన్ ​చెయ్యండి..

by Thanuru Gopichand |

అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్​జగన్​కేవలం 11 నిమిషాలు ఉండటం చాలా విచారకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

KA Paul : అసెంబ్లీకి వెళ్లకుంటే.. రిజైన్ ​చెయ్యండి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్​జగన్​కేవలం 11 నిమిషాలు ఉండటం చాలా విచారకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలని, ప్రజలకోసం వైసీపీ నాయకులు అసెంబ్లీ కి వెళ్లి సూచించారు. ప్రజాశాంతి పార్టీ కి ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడుతుందన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ర్టంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని ఆరోపించారని, ఇప్పడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదు అన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కోట్ల అప్పులతో రాష్ర్టం సర్వనాశనం అయిందన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారని ఆరోపించారు/

Next Story