- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయండి.. జనార్దన్ రావు వీడియోపై జోగి రమేష్ రియాక్షన్
ములకలచెరువు (Mulakala Cheruvu) నకిలీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ములకలచెరువు (Mulakala Cheruvu) నకిలీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఓ సంచలన వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియాలో అతడు మాట్లాడుతూ.. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని వాంగ్మూలం ఇచ్చాడు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలకు మాజీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో విచారణకు చంద్రబాబు (Chandrababu) తన చేతిలో ఉన్న ‘సిట్’ను వేశారని జోగి రమేష్ అన్నారు. కేసును దమ్ముంటే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎవరో ఒకర్ని కేసులో ఇరికించాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీకి ఏపీ కుటీర పరిశ్రమగా మారిందని జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో జనార్దన్ రావు మాట్లాడుతూ.. నకిలీ మద్యం తయారీకి ములకలచెరువు ప్రాంతాన్ని సూచించింది జోగి రమేష్ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బుదరజల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారని తెలిపారు. వాళ్లే తయారు చేయించి.. వాళ్లే రెయిడ్ చేయించారని పేర్కొన్నారు. తయారీదారులను టీడీపీ (TDP) సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చాడని చెప్పుకొచ్చారు. ఒకరోజు ముందే ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)కి సరుకు, క్యాన్లు తెప్పించారని తెలిపారు. ఆ తర్వాత వాళ్లే రెయిడ్ చేయించి కూటమి సర్కారుపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. జోగి రమేష్ ఆఫర్ చేసిన రూ.3 కోట్లకు ఆశపడే ఇదంతా చేశానని ఆ వీడియోలో జనార్దన్ రావు చెప్పుకొచ్చాడు.
Read more : జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ...నిందితుడు జనార్థన్ రావు సంచలన వీడియో






