జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ చేశాం: జనార్థన్ రావు సంచలన వీడియో

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-13 14:23:01  IST  )

జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ చేశామని నిందితుడు జనార్థన్ రావు సంచలన విషయాలు తెలిపారు..

జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ చేశాం: జనార్థన్ రావు సంచలన వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) చెప్పడంతోనే నకిలీ మద్యం(Fake Liquor) తయారు చేశామని నిందితుడు జనార్థన్ రావు(Janardhan Rao) తెలిపారు. నకిలీ మద్యం తయారీ కేసులో ఆయన్ను ఎక్సైజ్ పోలీసులు(Exise Police) అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు తెలిపారు.

‘‘గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేశాం. ప్రభుత్వం మారడంతో ఆపేశాం. జోగి రమేశ్ చెప్పం వల్లే మళ్లీ ప్రారంభించాం. నకిలీ మద్యం తయారీతో తెలుగుదేశం పార్టీపై బురద చల్లొచ్చని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దామనుకున్నాం. తంబళ్లపల్లెలో అయితేనే చంద్రబాబుపై దుష్ప్రచారం చేయొచ్చని జోగి రమేశ్ చెప్పారు. ఆర్థిక సాయం కూడా చేస్తామన్నారు. ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు నన్ను పంపించారు. నకిలీ మద్యం తయారీపై తన మనుషులతోనే జోగి రమేశ్ లీక్ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్ర చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను సస్పెండ్ చేయడంతో జోగి రమేశ్ ప్లాన్ మార్చారు. ఇబ్రహీంపట్నంలో సరుకు ఉంచాలని చెప్పారు. రైడ్‌కు ముందు రోజే ఇబ్రహీంపట్నంలో సరుకు తెచ్చి పెట్టాం. ముందుగానే లీక్ ఇచ్చి సాక్షి మీడియాతో రైడ్ చేయించారు. జోగి రమేశ్ పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వానిక చెడ్డ పేరు వచ్చింది. అనుకున్నట్టే జరిగింది. ఆఫ్రికా నుంచి రావొద్దు అని జోగి రమేశ్ చెప్పారు. నాకు బెయిల్ కూడా ఇప్పిస్తానని తెలిపారు. అంతా చూసుకుంటానని హ్యాండ్ ఇచ్చారు. నా సోదరుడిని కూడా ఇరికించారు. ఈ కేసులో అసలు సంబంధం లేదు. రమేశ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మోసం చేయడంతోనే బయలకు వచ్చి నిజాలు చెబుతున్నా.’’ అని జనార్ధన్ రావు వీడియోలో తెలిపారు.

Next Story