- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతికి దొరికి ఉంటే అంబటిని హతమార్చేవాళ్లు.. మాజీ స్పీకర్ సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్రంలో వైసీపీ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు (Ambati Rambabu,), జోగి రమేష్ (Jogi Ramesh) నివాసాలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లడుతూ.. మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు టీడీపీ వాళ్లకు దొరికి ఉంటే ఆయనను హతమార్చేవారని కామెంట్ చేశారు. అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని, జోగి రమేష్ ఏం తప్పు చేశాడని ఆయన ఇంటికి నిప్పు పెట్టారని నిలదీశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు.
నెయ్యి వివాదం రాద్ధాతం..
తిరుమల (Tirumala) లడ్డూ నెయ్యి వివాదంపై కూడా తమ్మినేని స్పందించారు. కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని నివేదికలు స్పష్టం చేస్తుంటే, ప్రభుత్వం ఇంకా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన ఫైర్ అయ్యారు. ఆడుతూ పాడుతూ అప్పుడూ కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచిపోయాయని అన్నారు. మిగిలిన మరో రెండేళ్లు కూడా ప్రజలు, విపక్ష నేతలు భయపడే పరిస్థితుల్లోనే ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. కానీ, ప్రజలకు అన్నీ గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పును ఇస్తారని తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేశారు.






