‘తల్లికి వందనం’ డబ్బులు జమ కాలేదా.. రేపే లాస్ట్ ఛాన్స్.. ఇలా చేయండి!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్టాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

‘తల్లికి వందనం’ డబ్బులు జమ కాలేదా.. రేపే లాస్ట్ ఛాన్స్.. ఇలా చేయండి!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్టాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లి ఖాతాలో ఈ క్రమంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నారు. అయితే తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. అర్హత ఉన్న కూడా కొందరి ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ కావడం లేదు.కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాని వారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు(జూన్ 20) ఒక్కరోజే తల్లికి వందనం డబ్బులు జమ కాని వారు ఫిర్యాదు చేసేందుకు ఛాన్స్ ఉంది. గ్రీవెన్స్ ఫామ్ ఫిల్ చేసి మీ గ్రామ, వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 28 వరకు ఫిర్యాదులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఈ నెల 30వ తేదీన అర్హలు కొత్త జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వచ్చే నెల(జూలై) 5న తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తారు. ఈ క్రమంలో తల్లికి వందనం డబ్బులు జమ కాని వారు వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Next Story