- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..: సీదిరి అప్పలరాజు
by Sathputhe Rajesh |
తనపై వస్తున్న ఆరోపణలపై ఏపీ మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తనపై వస్తున్న ఆరోపణలపై ఏపీ మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. తాను గానీ తన అనుచరులు గానీ ఇంచ్ భూమి ఆక్రమించారని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను చేసినట్లే అన్నారు. పలాస నియోజవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు.
టీడీపీ నాయకులు రూ.600 కోట్ల విలువ గల భూములు కబ్జా అయ్యాయని మీడియా ముందు పదేపదే చెబుతున్నారని ఆక్రమణ జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. తన అనుచరులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్యపై కూడా ఆరోపణలు చేస్తూ రాస్తున్నారని మంత్రి మండి పడ్డారు.
Next Story






