మావోయిస్టులు చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ చేయడం ఏంటి?: CPI Ramakrishna

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-22 09:33:43  IST  )

ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మావోయిస్టులు చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ చేయడం ఏంటి?: CPI Ramakrishna
X

దిశ,వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిన్న(బుధవారం) జరిగిన ఎన్ కౌంటర్ కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలే అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్ పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ యాంక్వెరీ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయకులు అయిన గిరిజన యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు మావోయిస్టులు చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ చేయడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మంది దారుణంగా చంపబడ్డారు అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలు ఊసే లేదన్నారు. పట్టణాల్లో ఉన్న వారికి 2 సెంట్లు, గ్రామాల్లో3 సెంట్లు అన్నారు. ఈ క్రమంలో పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

పాలన చెపట్టి ఏడాది అవుతున్న ఇప్పటికీ హామీలు తీర్చలేదు. సూపర్ 6 లో ఒక్క హామీ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రైతులను పూర్తిగా విస్మరించడం సరియైన పని కాదని ఆయన తెలిపారు. రైతులు పంట వేసే దగ్గర నుంచి మార్కెట్ లో ధర లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దుయ్యబట్టారు. జూన్ 2 న సూపర్ 6 అమలు చేయాలని మండల కార్యాలయాల వద్ద ధర్నా చేపడతాం అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

Next Story
null