- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ డాన్స్ వేస్తే? అంబటి రాంబాబు సూటి ప్రశ్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సూటి ప్రశ్న వేయడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సూటి ప్రశ్న వేయడం హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో సంప్రదాయ నృత్యాలు జరుగుతుండగా అంబటి రాంబాబు కొద్దిసేపు కళాకారులతో కలిసి డాన్స్ చేసిన విషయం అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఆ సందర్భంగా జనసేన, టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబును ట్రోల్ చేస్తూ ‘సంబరాల రాంబాబు’ అంటూ విమర్శించాయి. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అప్పట్లో ఈ అంశంపై వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ డాన్స్
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని, స్థానిక కళాకారులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న పిఠాపురం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కల్యాణ్ డాన్స్ చేసిన వీడియోను ఇవాళ (శుక్రవారం) ఎక్స్‌లో షేర్ చేసిన అంబటి రాంబాబు, ‘సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ డాన్స్ వేస్తే?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు డాన్స్, పవన్ కల్యాణ్ డాన్స్ వేయడానికి చాలా తేడా ఉందని వారు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, సంక్రాంతి సంబరాల పేరుతో రాజకీయ విమర్శలు మరోసారి తెరపైకి వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్వీట్ ఇదే..






