చంద్రబాబు గెలిస్తే Jr. NTR పరిస్థితి ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
చంద్రబాబు గెలిస్తే Jr. NTR పరిస్థితి ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తిప్పుకుని యాక్సిడెంట్ అయితే ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు తుప్పు అని ఆయన కొడుకు లోకేష్ పప్పు అని.. ఆయనకు పుట్టిన రోజుకు చావుకు కూడా తెలియదన్నారు. లోకేష్ ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని.. టీడీపీకి అధ్యక్షుడిని చేయాలని తద్వారా జూనియర్ ఎన్టీఆర్ ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను అభిమానించే వారంతా చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఒక వేళ చంద్రబాబు, లోకేష్ ను గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అనాథను చేస్తారని ఆరోపించారు.

Read More..

ఢిల్లీలో ఏపీ రాజకీయాలు.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు

Next Story

Most Viewed