- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ,వెబ్‌డెస్క్: ICET-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AP ICET 2025) ఈ నెల(మే) 7వ తేదీన రెండు షిఫ్ట్‌ల్లో సీబీటీ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్ష MBA, MCA కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో MBA, MCA కోర్సులకు నిర్వహించిన AP ICET-2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 34,131 మంది పరీక్ష రాస్తే 32,7199 క్వాలిఫై అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.ఈ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ను సందర్శించండి. తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు AP ICET కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.






