- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deputy CM Pawan Kalyan : వైసీపీ పాలనలో ఐఏఎస్.. బ్యూరోక్రాట్‌ల వ్యవస్థ నిర్వీర్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే..ఇంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్(IAS.. Bureaucratics)లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలదీశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే..ఇంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్(IAS.. Bureaucratics)లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) నిలదీశారు. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతాధికారులైన మీరు గత ప్రభుత్వ అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కల్గించిందన్నారు. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతోందని, ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. వైసీపీ విధ్వంసక పాలన కారణంగా రాష్ట్రం ఇప్పటికే 10లక్షల కోట్లు అప్పుల పాలైందని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు వంటి డైనమిక్ లీడర్ షిప్ లో ఏపీ పునర్నిర్మాణం దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కృషి చేయాల్సిఉందన్నారు.
గతంలో మాకు హైదరాబాద్ లో రాళ్లు, రప్పలతో కూడిన భూములు కనిపిస్తే చంద్రబాబుకు ఓ నగరం కనిపించిందని..అక్కడే ఆయన హైటెక్ సిటీని నిర్మించారని, అలాంటి గొప్ప పాలనా దక్షుడు మనకు ఉండటం మనకు బలమన్నారు. కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవహారం చూస్తే కసబ్ వంటి వారు జలమార్గంలో చోరబడటంలో ఆశ్చర్యం లేదన్నారు. నేను ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కేంద్ర నాయకులు తనతో పాలన వ్యవస్థ ఎలా ఉండాలో ఏపీని చూసి నేర్చుకోవాలని గతంలో చెప్పేవారమని, వైసీపీ పాలనతో ఇప్పుడు ఎలా ఉండకూడదో చెబుతున్నామని చెప్పడం జరిగిందన్నారు. ఇకనైనా ఐఏఎస్.. బ్యూరోక్రాట్‌లు స్వేచ్ఛగా, సమర్ధవంతంగా పనిచేసి వ్యవస్థలను బలోపేతం చేసి పాలనను గాడిలో పెట్టాలని కోరారు.






