- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చోను.. ఆ నేతకు రఘురామ మాస్ వార్నింగ్
అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని వాగ్ధానం చేసిన టీడీపీ (TDP) నాయకులు అన్యాయంగా పేదోళ్ల ఇళ్లను కూల్చేశారని ఇటీవలే సీపీఎం నేత శ్రీనివాస్ రావు (Srinivasa Rao) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని వాగ్ధానం చేసిన టీడీపీ (TDP) నాయకులు అన్యాయంగా పేదోళ్ల ఇళ్లను కూల్చేశారని ఇటీవలే సీపీఎం నేత శ్రీనివాస్ రావు (Srinivasa Rao) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉండి నియోజకవర్గ (Undi Constituency) పరిధిలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (MLA Raghurama Krishna Raju) ప్రోద్బలంతో 800 కుటుంబాలను రోడ్డు పాలు చేశారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా 600 ఇళ్లను నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారని బ్రిటీష్ (British) కాలం నాటి 1905 చట్టం ప్రకారం కూల్చివేతల నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజుపై మాటల తూటాలు పేల్చారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని రూ.వేల కోట్లు ఎగ్గొట్టాడని అన్నారు.
బ్రిటీష్ వాళ్లు అల్లూరి సీతారామారాజు (Alluri Seetharama Raju)ను దారుణంగా కాల్చి చంపితే ఆయన పేరుతో ఉన్న కాలనీని కూల్చేసి ఎమ్మెల్యే, అల్లూరిని మరోసారి హత్య చేశారని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు అనర్హుడని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సీపీఎం నేత శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చోలేనని వార్నింగ్ ఇచ్చారు. తన ఆదాయం, ఆస్తి వివరాలను ఎన్నికల ముందే అఫిడవిట్ (Affidavit) రూపంలో పూర్తిగా ప్రజల ముందు ఉంచానని అన్నారు. నాకు వార్నింగ్ ఇవ్వడానికి శ్రీనివాస రావు ఎవరంటూ రఘురామ ప్రశ్నించారు.






