మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా : CM చంద్రబాబు

by Thanuru Gopichand |

సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శుభాకాంక్షలు

మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా : CM చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్త ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఎక్స్ అధికారిక ఖాతాలో పర్సనల్ పోస్టును ప్రజలతో పంచుకున్నారు. అయితే ఒకరోజు ముందుగానే పింఛన్ దారులకు ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) కింద పింఛన్ ను పంపిణీ చేస్తున్నారు. అది కూడా ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అధికారులు అందజేస్తున్నారు. చలి పులిని తట్టుకుంటూ పంపిణీని కొనసాగిస్తున్నారు.

ఒక రోజు ముందుగనే అందిస్తున్నాం..

రేపటి నుంచి జనవరి 1, 2026 నూతన సంవత్సరం ప్రారంభం. కొత్త ఏడాది ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని.. ముఖ్యంగా పింఛన్ దారులు నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ముందుగానే డిసెంబర్ 31, 2025న అంటే ఒకరోజు ముందే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ మొత్వాన్ని ఇండ్ల వద్దకే వెళ్లి అందించేలా అధికారులను ఆదేశించింది. దీంతో ఉదయం నుంచే పంపిణీ ప్రారంభమైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టును చేశారు.

"ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ....ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు పెట్టాం. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశాం. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటు చేశాం. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు." -సీఎం చంద్రబాబు నాయుడు.

సీఎం సందేశం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పింఛన్ దారులు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారు.

Next Story