- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kumki elephants: వాటి బాధ్యత నాది.. ఆ ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటా
కుంకీ ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ఖాండ్రేకి మాట ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు.

స్వయంగా పర్యవేక్షిస్తా: పవన్ కళ్యాణ్
6 కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
దిశ, డైనమిక్ బ్యూరో : కుంకీ ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, (Sidharamayya) అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ఖాండ్రేకి మాట ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan kalwan)అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధాన సభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్కల్యాణ్సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను రాష్ట్ర అటవీ శాఖ (Forest Department) అధికారులకు కర్ణాటక అటవీశాఖ అందించింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ మానవ జనావాసలలోకి ఏనుగులు రావడం వలన గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కుంకీ ఏనుగులు రావడం వలన ఎంతోమంది ప్రాణాలను, ఆస్తినష్టాన్ని కాపడనున్నామని తెలిపారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు, అటవీ సంపద పరిరక్షణ, ఇతర పలు అంశాలపై ఇరు రాష్ట్రాల సహకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెం డు వేరువేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కేవ లం ఏనుగులను ఇవ్వడమే కాదు, వారి హృదయాన్ని ఆంధ్ర ప్రజల కోసం తెరిచారని కొనియాడారు. కుంకీ ఏనుగులను, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందజేశారు.






