- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను మిమ్మల్ని విడిచిపెట్టను’.. ముద్రగడ కుమారై సంచలన ట్వీట్!
'మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

దిశ, డైనమిక్బ్యూరో: 'మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయనకు అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారు. ఈ విషయంలో నేను తీవ్రంగా ఆందోళనతో ఉన్నాను’ అంటూ ఆయన కుమార్తె క్రాంతి వెల్లడించారు. ‘తండ్రిని ఎవరూ కలవకుండా గిరి నిర్బంధించారని, చికిత్సకు ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులకు సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల వెన్నుపోటు దినం కార్యక్రమంలో ముద్రగడ పాల్గొనలేక పోయారంటూ లేఖను విడుదల చేశారు. ‘ ఇటీవల ఒక మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.. కానీ నా సోదరుడు గిరితో పాటు అతని మామ మా నాన్న గారిని కలవడానికి అనుమతించలేదు. నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు.. ఆయన బంధువులకు, ఎప్పటి నుంచో వెంట నడుస్తున్న అనుచరులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గిరితో పాటు అతని అత్తమామల సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని.. ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని నాకు తెలిసింది. గిరి ఇది అమానుషం, ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే.. నాకు కచ్చితంగా స్పష్టంగా చెప్పాలి.. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్నగారికి సంరక్షణ అవసరం' అంటూ ట్వీట్ చేశారు.






