విచారణకు రాలేను: సిట్‌కు సమాచారం ఇచ్చిన విజయసాయిరెడ్డి

by Yella Dhawani Reddy |

ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.

విచారణకు రాలేను: సిట్‌కు సమాచారం ఇచ్చిన విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, తాను ఈరోజు విచారణకు రాలేనని విజయసాయిరెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారు. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వలన రాలేకపోతున్నట్లు తెలిపారు. తాను రేపో మాపో విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి సిట్ ముందు మాజీ ఎంపీ విచారణకు హాజరయ్యారు.

గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని.. కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. సూత్రధారులు, పాత్రధారులు, బిగ్‌ బాస్‌ అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.

అయితే ఈరోజు సిట్ ముందుకు విజయసాయి రావాల్సి ఉండగా.. అంతుముందే ఎక్స్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనే విధంగా భగవద్గీతకు సంబంధించి ఓ శ్లోకాన్ని ఆయన పోస్టు చేశారు.

Next Story