Vijayasairddy: వారి మిగతా బట్టలు విప్పేందుకు సహకరిస్తా..

by Thanuru Gopichand |

ఏపీలో లిక్కర్​స్కాంలో ఒక పైపున అరెస్టుల పర్వం మొదలవగా.. మరోవైపు ఈ కేసులు సాక్షిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్​చేశారు.

Vijayasairddy: వారి మిగతా బట్టలు విప్పేందుకు సహకరిస్తా..
X

విజయసాయి సంచలన ట్వీట్​

ఆయన చెప్పే దొరకని దొంగలు ఎవరో..?

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీలో లిక్కర్​స్కాంలో (AP Liquor Scam) ఒక పైపున అరెస్టుల పర్వం మొదలవగా.. మరోవైపు ఈ కేసులు సాక్షిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్​చేశారు. ‘ఏపీ లిక్కర్​స్కాంలో నా పాత్ర విజిల్​బ్లోయర్​. తప్పించుకునేదుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్​దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుక నేను పూర్తిగా సహకరిస్తా’ అంటూ ట్వీట్​చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో దొరకని దొంగలు అంటూ ఉటంకించడం వైసీపీ పెద్దలను కలవరపెడుతోంది. లిక్కర్​స్కాంలో కసిరెడ్డి కీలక వ్యక్తి అని గతంలో విజయసాయి ఆరోపణలు చేశారు. జగన్​కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయసాయి. గత జగన్​ప్రభుత్వం ఎదుర్కొంటున్న స్కాం ఆరోపణల్లో సాక్షిగా మారడం, విచారణ ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాశం అయింది. విజయసాయి అప్రూవర్​గా మారి జగన్​ను ఇరికిస్తున్నాడా.. అనే అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. ఈ మధ్యలో ఆయన బీజేపీలో చేరతాడనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో విజయసాయి ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి. లిక్కరు దొంగల మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తా అని చెప్పడం.. ఆయన ఎదుర్కొంటున్న పలు కేసుల్లో అప్రూవర్​గా మారతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story