అలాంటి వాళ్లను చెప్పు తెగేదాకా కొడతా.. ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఎమ్మెల్యే అన్నాక.. ఓర్పు, సహనం, నలుగురిని కలుపుకుని పోయే తత్వం ఉండాలి.

అలాంటి వాళ్లను చెప్పు తెగేదాకా కొడతా.. ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే అన్నాక.. ఓర్పు, సహనం, నలుగురిని కలుపుకుని పోయే తత్వం ఉండాలి. నియోజకవర్గ అభివృద్ధిపై నిత్యం ఫోకస్ చేస్తూ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. కానీ, కృష్ణా జిల్లా పరిధిలోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao) తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తాజాగా, ఓ అధికారిక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. నియోజకవర్గ పరిధిలోని కొండూరు (Kondur) ప్రాంతంలో తాగు నీరు సరిగా సప్లయ్ చేయడం లేదని అక్కడి ప్రజలకు ఆరోపిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొందరు తమ ప్రాంతంలో గత 20 రోజులుగా మంచినీరు రావడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నీటి సరఫరాపై కొలికపూడి స్పందించారు. కావాలనే కొందరు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు. అలా.. గాలి వార్తలు సృష్టించే వాళ్లను ‘చెప్పు తెగేదాక’ కొడతా అంటూ అదే సమావేశంలోనే చిందులు తొక్కుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే మాటలు విన్న నియోజకవర్గ ప్రజలు.. ఏంటా మాటలు అని చెవులు కొరుక్కుంటున్నారు.

Next Story