- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Manoj : యూనివర్సిటీ అవకతవకలను ఎత్తిచూపినందుకే నాపై కక్ష : మంచు మనోజ్
మంచు మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీ(University)లో అవతవకలు ఎత్తి చూపినందుకే నాపై కక్ష పెంచుకున్నారని నటుడు మంచు మనోజ్(Manchu Manoj) వాపోయారు

దిశ, వెబ్ డెస్క్ : మంచు మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీ(University)లో అవతవకలు ఎత్తి చూపినందుకే నాపై కక్ష పెంచుకున్నారని నటుడు మంచు మనోజ్(Manchu Manoj) వాపోయారు. నేను ఈ రోజు తాత, నానమ్మల, సోదరుడు ప్రసాద్ ల సమాధుల వద్ధ కూర్చుని కుటుంబంలో జరుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుకుందామనుకున్నానని..నిజంగా సాయిబాబా మీద ఒట్టు ఇలాంటివి జరుగకూడదని..అయినా ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు.
ఒకవైపు యూనివర్సిటీ సెక్యురిటీ ఉన్నప్పటికి, మరోవైపు పోలీసులు కూడా ఉన్నారని..అయినా ఢిల్లీ నుంచి బౌన్సర్లను రప్పించుకున్నారన్నారు. నా హోర్డింగులను కూడా తొలగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నప్పుడు నాతో గొడవపడటం..అమ్మ జన్మదినాన చక్కర పోయడం, ఆమె బ్రెయిన్ వాష్ చేసి ఫిర్యాదులో సంతకం పెట్టించుకోవడం వంటి వాటితో పాటు తాజాగా నన్ను యూనివర్సిటీలోని సమాధుల వద్దకు వెళ్లకుండా కూడా అడ్డుకున్నారన్నారు. వీటన్నింటికి సమాధానం లభించే వరకు నేను ఆగబోనన్నారు.
నేను తమ్ముడినే కదా? కూర్చొని మాట్లాడదాం అంటున్నాను కదా? అంటే మా అన్న, నాన్న వినడం లేదన్నారు. నాకు మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నారో, భయపడతున్నారో తెలియడం లేదన్నారు. యూనివర్సిటీ కుటుంబంలో అందరిదని, వివాదం కోర్టులో ఉందని...అక్కడైనా సరే..పెద్దమనుషుల సమక్షంలోనైనా సరే పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్ స్పష్టం చేశారు.






