- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ అధికారులకు అన్నీ నిజాలే చెప్పా.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)ని గురువారం సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో సిట్ అధికారులకు అన్నీ నిజాలే చెప్పానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు తెలియడానికి తాను కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. తన దగ్గర పీఏగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారని.. కానీ, అతడు 2018 తర్వాత తన వద్ద పనిచేయడం లేదని అన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం శ్రీవారి సొమ్ము కాపాడేందుకు ప్రయత్నించానని అన్నారు. శ్రీవాణి పథకం ద్వారా దళారులను నివారించామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.






