- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకు ఆయనకు మనస్పర్థలు ఉన్నాయ్.. కలిసి ఎలా పని చేస్తా?’: మాజీ మంత్రి
క్వార్జ్ కుంభకోణం కేసులో పోలీసులు కూపీ లాగారు.

దిశ,వెబ్‌డెస్క్: క్వార్జ్ కుంభకోణం కేసులో పోలీసులు కూపీ లాగారు. ఈ నేపథ్యంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అక్రమ రవాణా జరిగినట్లు అందించిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ తరుణంలో క్వార్జ్ అక్రమ తవ్వకాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ(శుక్రవారం) మాజీ మంత్రి అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ కేసులో నాపేరు ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణితో నాకు లావాదేవీలు ఉన్నాయని అంటున్నారు. నా పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి.. ‘గతంలో కాకాణితో నాకు మనస్పర్థలు ఉండేవి. అలాంటిది మేం ఇద్దరం కలిసి ఎలా వ్యాపారం చేస్తాం’ అని మాజీ మంత్రి అనిల్ అన్నారు. ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే.. అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అని ఆయన తేల్చి చెప్పారు.
ఆఫ్రికా, విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో నాకు ఎలాంటి మైన్స్ లేవు. క్వార్ట్జ్ మైనింగ్‌పై ఈడీ విచారణ చేయించండని అన్నారు. ఈడీకి లేఖ రాస్తానని తెలిపారు. నా ఆస్తులపై సిట్ వేయాలని సీఎం చంద్రబాబును డిమండ్ చేశారు. నేను ఎలాంటి అక్రమాస్తులను సంపాదించలేదు. 2008 కి ముందున్న ఇప్పుడున్న ఆస్తులపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. క్వార్ట్జ్ మైనింగ్ పై ఈడీ విచారణ చేయించండి. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ మండిపడ్డారు. గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండని చెప్పారు. వెయ్యి కోట్లు ఉన్నాయంటున్నారు.. ఉంటే అమరావతికి తీసుకోండని అన్నారు. గురువారం నెల్లూరులో జరిగిన మాజీ సీఎం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు.. 2000 మంది పోలీసులను పెట్టారు. నల్లపురెడ్డి వ్యాఖ్యల కేసులో 4న విచారణకు వెళ్తానని తెలిపారు. జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధమని అనిల్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.






