- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్క అని కూడా చూడలేదు.. విచక్షణ రహితంగా దాడి
బంధాలు బంధుత్వాల మధ్య ఆప్యాయతలు అనురాగాలు సన్నగిల్లి, తోబుట్టువులు కూడా బద్ధ శత్రువులైన పరిస్థితి నేటి సమాజంలో కనిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లాలో (Annamayya District) తోబుట్టువుల మధ్య ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. వరుసకు అక్క అయిన మహిళపై ఓ తమ్ముడు వేటకొడవలితో (Brother Attack Sister) విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేటకొడవలితో తమ్ముడి వీరంగం
అన్నమయ్య జిల్లా బోయకొండ యానాదిపాలెంలో గంగులమ్మ (Gangulamma) అనే మహిళపై ఆమె తమ్ముడు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. సొంత అక్క అని కూడా చూడకుండా, వేటకొడవలితో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో గంగులమ్మ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు ఎంత క్రూరంగా దాడి చేశాడంటే, ఆ ప్రయత్నంలో గంగులమ్మ ఎడమచేయి బొటనవేలు తెగి పడిపోయింది. రక్తం కారి బట్టలంతా రక్తసిక్తం అయ్యాయి.
విషమంగా బాధితురాలి పరిస్థితి
రక్తపు మడుగులో పడి ఉన్న గంగులమ్మను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మదనపల్లి (Madanapalle) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కేసు నమోదు - దర్యాప్తు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గొడవకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు అంటున్నారు.
జిల్లాలో పెరుగుతున్న నేరాలు
అన్నమయ్య జిల్లాలో ఇటీవల వరుస నేరాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో కంభంవారిపల్లె మండలంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాత హత్య కేసులో నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు తోబుట్టువుల మధ్య జరిగిన ఈ ఘోర దాడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.






