- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతంలో వ్యవసాయం చేశాను.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను : ముఖ్యమంత్రి
గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని.. ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని.. ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం చమత్కరించారు. పామాయిల్ పంటను ఎన్టీఆర్ హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. మలేషియా నుంచి పామాయిల్ మొక్కను ఏపీకి తీసుకొచ్చామన్నారు. అక్కడ వర్షపాతం ఎక్కువ కావడం వల్ల ఆ ప్రాంతానికి అనుగుణంగా పామాయిల్ పంటలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ నీటి కొరత ఇబ్బంది ఉందన్నారు. తన లక్ష్యంగా జీరోనెట్ వ్యవసాయమని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఏ ఒక్క ఉత్పత్తి వ్యర్థం కావొద్దనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. అందుకోసం సమగ్ర ప్రణాళిక అవసరం అవుతుందన్నారు.
వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం పంట విస్తీర్ణంతో పాటు వేసిన పంటల గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అందుకు రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను రైతుల నుంచి ఆధునిక సాంకేతిత పట్ల శ్రద్ధను పెంచుకోవడం ఆశిస్తున్నానని తెలియజేశారు. తద్వారా ప్రణాళికబద్ధమైన విధానాల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు అన్నారు. వ్యవసాయంలో ఆదాయం పెంచుకుంటే తరువాత స్థాయికి చేరుకునేందుకు వీలు పడుతుందన్నారు. అందుకు జవాబుదారీతనంతో కూడిన ప్రణాళికలను రూపొందించే బాధ్యత తనపై వదిలేయాలని సూచించారు. గ్రామంలో నీటి కొరత ఉందని రైతులు ముఖ్యమంత్రికి తెలిపారు. చాలా వరకు నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. నీటిని నిల్వ చేయడంతో పాటు, నీటి కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నీరు వ్యర్థం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయితే రైతులు కూడా భూగర్భ జలాలను పెంచే పద్ధతులను అనుసరించాలన్నారు. అందుకు ప్రత్యామ్నాయ పంటలను పండించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. రైతులు వినూత్న ఆలోచన విధానాన్ని అలవరచుకోవాలని కోరారు. నాచురల్ ఫార్మింగ్ లో డ్రోన్ తో పిచికారీ చేయడం జరుగుతోంది. అన్ని గ్రామాలు నల్లజర్ల మాదిరి చేయడం తన కోరికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓ వైపు సూపర్ సిక్స్ - ఇంకోవైపు చూస్తే ఖజానా ఖాళీ అన్నారు. రాష్ట్రంలో వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్నారు. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా అప్పులు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.






