‘అలాంటి మాటలు మాట్లాడితే క్షమించాం’.. ఆ వీడియో రిలీజ్ చేసిన మంత్రి

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-07 11:09:37  IST  )

ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘అలాంటి మాటలు మాట్లాడితే క్షమించాం’.. ఆ వీడియో రిలీజ్ చేసిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియాలో అవమానించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది.

అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. మాజీ సీఎం జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్ళు కొలువైన రాజధాని అమరావతి అన్నారు. ఈ క్రమంలో మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.

విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని తెలిపారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన తల్లులను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన వైఎస్ జగన్ గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని ఆయన స్పష్టం చేశారు.

ఆడపిల్లలా ఏడవద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం(AP Government) ఊరుకోదు అని హెచ్చరించారు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన వైఎస్ జగన్ బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని మంత్రి లోకేష్ తెలిపారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందులేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామని అన్నారు. ఈ క్రమంలో ‘దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుంది’ అని మత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Next Story