లై డిటెక్ట్ టెస్టులకూ నేను సిద్ధమే.. జనార్దన్ రావు చాట్ లీక్‌పై జోగి రమేశ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-15 09:59:42  IST  )

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) విచారణలో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు.

లై డిటెక్ట్ టెస్టులకూ నేను సిద్ధమే.. జనార్దన్ రావు చాట్ లీక్‌పై జోగి రమేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) విచారణలో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. తాజాగా, తాను మాజీ మంత్రి జోగి రమేశ్‌ (Jogi Ramesh)తో జరిపిన వాట్సాప్‌ చాట్‌ను (Whatsaap Chat) కూడా బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే జనార్దన్ రావుతో వాట్సాప్ చాటింగ్‌‌ అంశంపై జోగి రమేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడితో తాను చాటింగ్ చేసినట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణం చేసేందుకు వెనకాడబోనని తెలిపారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలతో ప్రమాణం చేయాడానికి వస్తారా.. అని ప్రశ్నించారు. తన ఫోన్‌ను సీఎం చంద్రబాబు, లోకేశ్‌లకు ఇస్తానని, వారే స్వయంగా చెక్ చేసుకోవాలన్నారు. లై డిటెక్ట్ టెస్టులకు తాను సిద్ధమేనని ప్రకటించారు. పైన దేవుడు ఉన్నాడని.. ఆయన అంతా చూస్తాడని జోగి రమేశ్ కామెంట్ చేశారు.

Next Story