నేను బ్రిలియంట్ స్టూడెంట్‌ను కాదు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 06:41:49  IST  )

చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను బ్రిలియంట్ స్టూడెంట్‌ను కాదు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్‌గా అవకాశం ఇచ్చారని, కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు. ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్‌లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు.

చదువుకునేటప్పుడు తాను బ్రిలియంట్ స్టూడెంట్ ఏమీ కాదని.. 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మంత్రి నారా లోకేశ్ రెవల్యూషనరీ థింకింగ్ చేస్తాడని కొనియాడారు. దేశం మనుగడలో ఉన్నంత వరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారని అన్నారు. రాజ్యాంగం గొప్పదనాన్ని ప్రతి పౌరుడికి చాటి చెప్పాలన్నారు. ఇంకా కొన్ని దేశాల్లో బలహీనవర్గాలకు ఓటు హక్కు కల్పించలేదని.. అమెరికాలో ఎప్పుడూ మహిళలు ప్రెసిడెంట్ కాలేదని తెలిపారు. కానీ, ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశమని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story