- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ బ్రౌన్ ఫిల్డ్ సిటీ.. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ: సీఎం చంద్రబాబు
మూడు దశాబ్దాలుగా తాను టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మూడు దశాబ్దాలుగా తాను టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఇవాళ విజయవాడ (Vijayawada)లో భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (FICCI) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు సీఎంగా ఉన్న నాడే హైటెక్ సిటికీ మైక్రోసాఫ్ట్ (Microsoft) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని దేశాల్లో యువత సమస్య ఉందని పేర్కొన్నారు.
ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వచ్చాయని తెలిపాడు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ట్రెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. కాంపిటీటివ్ ఎకానమీతో మనం ముందుకు వెళ్తున్నామని.. ప్రధాన నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని అన్నారు. హైదరాబాద్ బ్రౌన్ ఫిల్డ్ సిటీ.. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా అద్భుత నగరంగా అమరావతి మారబోతోందని.. టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారాలో అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






