- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణానంతరం టీటీడీకి రూ.3 కోట్ల ఇల్లు.. రూ.66 లక్షల విరాళం
తమ మరణానంతరం కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని వీలైనన్ని ఆస్తుల్ని కూడబెడుతోన్న ఈ రోజుల్లో.. మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ భాస్కర్ రావు తన మరణానంతరం తన ఇల్లు, బ్యాంకులో ఉన్న నగదును టీటీడీ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తమ మరణానంతరం కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని వీలైనన్ని ఆస్తుల్ని కూడబెడుతోన్న ఈ రోజుల్లో.. మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ భాస్కర్ రావు తన మరణానంతరం తన ఇల్లు, బ్యాంకులో ఉన్న నగదును టీటీడీ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన వీలునామా రాశారు. దీంతో ఆయన ఆఖరి కోరికను ట్రస్ట్ సభ్యులు నెరవేర్చారు.
హైదరాబాద్ కు చెందిన ఐఆర్ఎస్ మాజీ అధికారి భాస్కర్ రావు ఇటీవలే మరణించారు. మరణానంతరం ఆయనకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఇల్లు, ఆయన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.66 లక్షల నగదును ట్రస్టీలు ఎం. దేవరాజ్ రెడ్డి, సత్యనారాయణ, లోక్ నాథ్ లు గురువారం టీటీడీ అదనపు ఈఓకు రంగనాయకుల మండపంలో విరాళంగా అందజేశారు. ఈ ఘటనకు ఆయనకు స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా నిలిచింది. వనస్థలిపురంలో ఆనందనిలయం పేరుతో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వినియోగించాలని కోరారు. అలాగే.. బ్యాంకులో ఉన్న నగదులో రూ.36 లక్షలు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు, సర్వశ్రేయాస్, వేద పరిరక్షణ, గో సంరక్షణ, విద్యాదాన, శ్రీవాణి ట్రస్టులకు రూ.6 లక్షల చొప్పున విరాళంగా ఇవ్వాలని భాస్కర్ రావు వీలునామాలో పేర్కొన్నారు.






