శ్రీవారిపై అపారభక్తిని చాటుకున్న హైదరాబాద్ దంపతులు.. స్వామికి విరాళంగా ఇల్లు

by Naga Rani Yarlagadda |

ఇటీవల కాలంలో టీటీడీకి భారీ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంచేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్ రావు తన వీలునామాలో..

శ్రీవారిపై అపారభక్తిని చాటుకున్న హైదరాబాద్ దంపతులు.. స్వామికి విరాళంగా ఇల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో టీటీడీ (TTD)కి భారీ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంచేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్ రావు (IRS Official Bhaskar Rao) తన వీలునామాలో ఇంటితో పాటు బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును టీటీడీకి విరాళంగా ఇవ్వాలని రాసిన విషయం తెలిసిందే. ఆయన కోరిక మేరకు ట్రస్ట్ సభ్యులు టీటీడీకి ఆ పత్రాలు, నగదును అందజేశారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్ కు చెందిన దంపతులు టీటీడీకి తమ ఇంటిని విరాళంగా ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్‌గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి. కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులకు సంతానం లేదు. తమకు 250 గజాల్లో ఉన్న రూ.18.75 లక్షల విలువైన ఇంటిని శ్రీవారి పేరుపై వీలునామా రాసి తమ భక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన పత్రాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి మంగళవారం అందజేశారు. భక్తులు ఇలా తమ ఇళ్లను స్వామివారికి ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రసాద్, సునీత దంపతుల్ని అభినందించారు.

Next Story