- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో షాకింగ్ ఘటన.. భార్య కాపురానికి రావట్లేదని డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త
సాధారణంగా భార్యలు కాపురానికి రాకపోతే భర్తలు పంచాయితీ పెట్టి పెద్దలతో మాట్లాడి ఆమెను ఇంటికి తెచ్చుకుంటారు. మరికొందరు అయితే విడాకులు ఇస్తామని బెదిరించడం, చచ్చిపోతానని బెదిరించడం లాంటివి చేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా భార్యలు కాపురానికి రాకపోతే భర్తలు పంచాయితీ పెట్టి పెద్దలతో మాట్లాడి ఆమెను ఇంటికి తెచ్చుకుంటారు. మరికొందరు అయితే విడాకులు ఇస్తామని బెదిరించడం, చచ్చిపోతానని బెదిరించడం లాంటివి చేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. భార్య కాపురానికి రావడం లేదు అనే కారణంగా ఏకంగా డెత్ సర్టిఫికెట్ పంపాడు ఆ వ్యక్తి. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముద్దనూరుకు చెందిన మారుతిరాజు అనే వ్యక్తికి కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మితో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పెళ్లి తరవాత కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో వివాదాలు మొదలయ్యాయి. ఇక దంపతులు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగ్గా నెల రోజుల క్రితం ఆదిలక్ష్మి చెప్పకుండా తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని విసిగిపోయిన భర్త డెత్ సర్టిఫికెట్ చేయించి ఆమెకు పోస్ట్ ద్వారా పంపాడు. కాగా తాను బతికే ఉండగానే భర్త డెత్ సర్టిఫికెట్ పంపడంపై భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తను విచారించగా తన తల్లి డెత్ సర్టిఫికెట్ లో మార్పులు చేసి భార్య పేరు రాసి పంపినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు దంపతులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా బతికుండగానే డెత్ సర్టిఫికట్ పంపిన వార్త బయటకు రావడంతో స్థానికంగా చర్చకు దారితీసింది.






