తిరుపతి జిల్లాలో దారుణం.. భార్య, పిల్లలను చంపిన భర్త

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 12:46:30  IST  )

తిరుపతి జిల్లాలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్యాయత్నం చేశారు..

తిరుపతి జిల్లాలో దారుణం.. భార్య, పిల్లలను చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: మరో పండంటి కాపురం కూలిపోయింది . ఇన్నాళ్లు కలిసి ఉన్న ఫ్యామిలీ ఇప్పుడు చిద్రమైపోయింది. భర్త తప్ప భార్య, పిల్లలు చనిపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. పాకాల మండలం మదినాయినపల్లెకు చెందిన గిరి.. భార్య హేమలత, పిల్లలు తనుశ్రీ, తేజశ్రీతో కలిసి ఉంటున్నారు. రోజు మాదిరి ఈ రోజు కూడా అలాగే ఉన్నారులే అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా షాకింగ్ ఘటన కలకలం రేగింది. గిరి తన భార్య పిల్లలను బావిలో తోసి చంపేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం గిరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గిరి కుటుంబ ఉదంతం వెనుక ఏం జరిగి ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబ కలహాలు చెలరేగాయా..?, లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు కుటుంబ బాంధవ్యాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా, భర్తలు ఇద్దరూ ఒకేమాటపై ఉంటే దారుణ ఘటనలు ఉండవని చెబుతున్నారు. అయితే గిరి ఫ్యామిలీ ఘటన ప్రస్తుతం మిస్టరీగా మారింది. పోలీసులు అసలు కారణాలు బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అసలు నిజాలు రాబట్టే అవకాశం ఉంది.

Next Story