ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.. గాయత్రి మృతిపై భ‌ర్త శ్రీచ‌ర‌ణ్ కీల‌క వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల ఏపీకి చెందిన రాధ గాయ‌త్రి అనే వివాహిత ముస్సోరీలో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌తో క‌లిసి ట్రిప్ కు వెళ్లిన గాయ‌త్రి తాము తీసుకున్న హోట‌ల్ గ‌దిలో తెల్లారేస‌రికి విగ‌త‌జీవిగా క‌నిపించింది.

ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.. గాయత్రి మృతిపై భ‌ర్త శ్రీచ‌ర‌ణ్ కీల‌క వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల ఏపీకి చెందిన రాధ గాయ‌త్రి అనే వివాహిత ముస్సోరీలో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌తో క‌లిసి ట్రిప్ కు వెళ్లిన గాయ‌త్రి తాము తీసుకున్న హోట‌ల్ గ‌దిలో తెల్లారేస‌రికి విగ‌త‌జీవిగా క‌నిపించింది. అయితే భ‌ర్తే త‌న కూతురును హ‌త్య చేశాడ‌ని గాయ‌త్రి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌ర్త శ్రీచ‌రణ్ మీడియాతో మాట్లాడారు. గాయ‌త్రిని తాను చంప‌లేద‌ని అన్నాడు. ముస్సోరీలో ఆ రోజు రాత్రి ఇద్ద‌రం క‌లిసి రెడ్ వైన్ తాగామ‌ని అన్నాడు. దానికంటే ముందు కేక్ తిన్నామ‌ని చెప్పాడు. రెడ్ వైన్ తాగి రాత్రి నిద్ర‌పోయామ‌ని తెల్లారేస‌రికి త‌న భార్య అచేతనంగా ప‌డిపోయి ఉంద‌న్నాడు. ఆమె ముక్కులో నుండి ర‌క్తం వ‌చ్చింద‌ని తెలిపాడు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ అని ముస్సోరి డాక్ట‌ర్లు చెప్పార‌ని తెలిపాడు.

కూతురు చ‌నిపోయింద‌న్న బాధ‌లో గాయత్రి త‌ల్లిదండ్ర‌లు త‌న‌ను అనుమానిస్తున్నార‌ని చెప్పాడు. తాను డిప్రెష‌న్ లో ఉన్నాన‌ని, త‌న‌కు ఏం జ‌రుగుతుందో కూడా అర్థం కావ‌డంలేద‌ని అన్నారు. గాయ‌త్రి త‌న‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకునేదని చెప్పాడు. మొద‌ట్లో కొన్ని మ‌న‌స్ప‌ర్దలు వ‌చ్చినా అవ‌న్నీ స‌ర్దుకుపోయాయ‌ని అన్నాడు. గాయ‌త్రి జ‌పం చేసిన త‌ర‌వాత గాయ‌త్రిని దేవుడు త‌న‌కు ఇచ్చాడ‌న్నాడు. ముందుగా ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డిన త‌ర‌వాతే తాము పెద్ద‌ల‌ను ఒప్పించి వివాహం చేసుకున్నామ‌ని తెలిపాడు. వైవాహిక జీవితంలో గొడ‌వ‌లు సాధార‌ణం అని త‌మ జీవితంలోనూ అలాంటి గొడ‌వ‌లు జ‌రిగినా ఇప్పుడు క‌లిసి ఉన్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. గాయ‌త్రి బ్యాగ్ లో ఉన్న ట్రాక‌ర్ ను తాను చూడ‌లేద‌ని అన్నాడు.

Next Story