- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ కనుసన్నల్లోనే రూ.వందల కోట్లు మాయం : మాజీ మంత్రి దేవినేని ఉమా
by Kema Shiva Kumar |
జగన్ కనుసన్నల్లోనే వైసీపీ నాయకులు రూ.వందల కోట్లు మాయం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : జగన్ కనుసన్నల్లోనే వైసీపీ నాయకులు రూ.వందల కోట్లు మాయం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా దండుకున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లతో కొడాలి నాని గ్యాంగ్ రూ.వందల కోట్లు స్వాహా చేశారని తెలిపారు. క్యాసినో, పేటాక శిబిరాల నిర్వహణలో రాటుదేలిన ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును, ఆయన కుటుంబంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేసిన పాపాలకు సన్న బియ్యం సన్నాసి.. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు.
Next Story






