- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: ప్రజా సేవల్లో హ్యుమానిటీ.. పాలనలో ఏఐ
పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత
రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేక్
వేగంగా భూరికార్డుల డిజిటలైజేషన్
టెక్నాలజీతో రియల్‌టైమ్‌లో సేవల డెలివరీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు (AI)ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చని... ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ (Government) డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్‌షాప్‌ను (Work Shop) ప్రారంభించి, ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్టప్‌లు రూ.30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని, దీంతో ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందన్నారు. ఈ వర్క్‌షాప్ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని, డిజిటల్, డైనమిక్, ప్రజల కోసం పని చేసే పాలనకు ఇది ఆరంభమని ముఖ్యమంత్రి అన్నారు.
రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు హాజరుకాగా, రెండోరోజు విభాగాధిపతులు పాల్గొంటారు. ఈ వర్క్‌షాప్‌కు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్ హజరయ్యారు.






