- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు తీరంలో మానవత్వం.. అరుదైన తాబేలు ప్రాణం కాపాడిన ICGS సిబ్బంది!
సముద్ర సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాసే భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది, మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సముద్ర సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాసే భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది, మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడు తీరంలో గస్తీ నిర్వహిస్తున్న 'ఐసీజీఎస్' (ICGS) నౌక సిబ్బంది, చేపల వలలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అరుదైన ఒలివ్ రిడ్లీ (Olive Ridley) తాబేలును సురక్షితంగా రక్షించారు.
సమయస్ఫూర్తితో రక్షణ చర్యలు..
గస్తీ సమయంలో సముద్రంపై తేలుతున్న ఒక పాత చేపల వలలో తాబేలు చిక్కుకుని బయటపడలేక పోరాడుతుండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ సభ్యులు, తాబేలుకు ఎటువంటి గాయం కాకుండా ఎంతో జాగ్రత్తగా దాని మెడకు చుట్టుకోని ఉన్న వలను కత్తిరించి దానికి విముక్తి కల్పించారు. అనంతరం ఆ తాబేలును తిరిగి సముద్ర గర్భంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన ఈ సాహసోపేతమైన, మానవీయ కార్యకలాపాన్ని పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
జీవవైవిధ్యంలో కీలక పాత్ర..
కాగా, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం ఒలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యంత రక్షిత జీవుల జాబితాలో ఉన్నాయి. సముద్ర జీవవైవిధ్యాన్ని (Marine Biodiversity) సమతుల్యంగా ఉంచడంలో ఈ జాతి తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.






