రాష్ట్రంలో తీవ్ర కలకలం.. పాక్‌కు అనుకూలంగా యువకుడి నినాదాలు!?

by Jakkula.Mamatha |

పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో తీవ్ర కలకలం.. పాక్‌కు అనుకూలంగా యువకుడి నినాదాలు!?
X

దిశ,వెబ్‌డెస్క్: పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్స్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంది. ఈ తరుణంలో మూడు రోజుల నుంచి భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఇండియా–పాక్ ఉద్రిక్తత వేళ అన్ని రాష్ట్రాల్లో భారీగా రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాలు సూచించాయి.

ఈ క్రమంలో ఏపీలో కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఓ యువకుడి నినాదాలు తీవ్ర కలకలం రేపాయి. పాకిస్తాన్‌కు అనుకూలంగా యువకుడు నినాదాలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ యువకుడు నినాదాలు చేస్తున్న క్రమంలో కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో అమలాపురం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆ యువకుడు సాలూరులో ఉన్నట్లు విజయనగరం పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story