- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD News : టీటీడీ కళ్యాణ వేదికకు భారీ స్పందన.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?
టీటీడీ(TTD) ప్రత్యేకంగా నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు భారీ స్పందన వస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ(TTD) ప్రత్యేకంగా నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు భారీ స్పందన వస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి టీటీడీ ఈ కార్యక్రమాన్ని తిరుమల(Tirumala)లోని కళ్యాణ వేదిక(Kalyana Vedika) వద్ద ఉచితంగా నిర్వహిస్తోండగా.. వేలమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా ఈ పవిత్ర కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి 2025 మే 1 వరకు మొత్తం 26, 214 వివాహాలు టీటీడీ ఆధ్వర్యంలోజరిగిననట్టు పేర్కొన్నారు. వివాహ సమయంలో పసుపు, కుంకుమ, కంకణం వంటి వస్తువులతోపాటు.. ఉచిత పురోహిత సేవలు, మంగళ వాయిద్య సేవలు టీటీడీ అందిస్తుంది. వివాహం అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులు.. మొత్తంగా ఆరుగురికి రూ.300 సర్వదర్శనం కల్పిస్తారు. మిగతా వివరాల కోసం https://ttddevasthanam.ap.gov.in వెబ్సైట్ లోకి లాగిన్ అయి, ప్రొసీజర్ ఫాలో అవ్వాలని టీటీడీ సూచించింది.
Next Story






