NCLTలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఊరట.. షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఉత్తర్వులు

by Kema Shiva Kumar |

వైసీపీ (YCP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో భారీ ఊరట లభించింది.

NCLTలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఊరట.. షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో భారీ ఊరట లభించింది. తన సోదరి వైఎస్ శర్మిల (YS Sharmila) పేరు మీద తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) అక్రమంగా షేర్లను బదిలీ చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. అదేవిధంగా షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పిటిషన్‌పై జూలై 15న విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్ తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. అయితే, తాజాగా జగన్ పిటిషన్‌పై NCLT సంచలన తీర్పును వెల్లడించింది. వైఎస్ శర్మిల, విజయమ్మ సర్వస్వతీ షేర్లను బదిలీ చేయడం అక్రమమేనని పేర్కొంది. అదేవిధంగా షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని NCLT ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఎన్‌సీఎల్‌టీలో వైఎస్ జగన్ (YS Jagan) తరపు న్యాయవాది మాట్లాడుతూ.. శర్మిల, విజయమ్మ తన క్లయింట్ జగన్ అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేశారని.. ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కంపెనీ చట్టం ప్రకారం షేర్ల బదిలీకి షేర్ హోల్డర్ సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందనన్నారు. కానీ, ఆ ప్రాసెస్ పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ తరహా బదిలీలు ముందస్తుగా అవగాహన లేకుండా జరిగితే, వాటిని రద్దు చేయాల్సిందేనని వాదనలు వినిపించారు. అందుకు శర్మిల, విజయమ్మ తరఫు న్యాయవాది కౌంటర్ ఇచ్చారు. షేర్ల బదిలీ పూర్తిగా చట్టపరమైనదిగా జరిగిందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ షేర్ల బదిలీని వెంటనే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story