రాష్ట్రంలోని మత్స్యకారులకు భారీ ఊరట

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-14 07:59:37  IST  )

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలోని మత్స్యకారులకు భారీ ఊరట
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) చేపల ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు వేటను నిషేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మత్స్యకారులకు భృతి కింద కొంత డబ్బును సాయం అందిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఒక్కో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేది. ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు పెంచిన విషయం తెలిసిందే.

వేటకు వేళాయే..

ఈ రోజు(జూన్ 14) రాత్రి నుంచి మత్స్యకారులు చేపల వేటకు వేళ్లడానికి సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) శుభాకాంక్షలు తెలిపారు. రేపటి(ఆదివారం) నుంచి చేపల వేట సాగించడానికి మత్స్యకారులు ఏర్పాట్లు చేసుకోవాలి. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేసుకుని, బోట్లకు రంగులు వేసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుని, ఆనందంగా చేపల వేట మొదలు పెట్టాలని మంత్రి సూచించారు.

మత్స్యకారుల సేవలో భాగంగా రాష్ట్రం(Andhra Pradesh)లోని 1,29,178 మంది మత్స్యకారులకు, 258.356 కోట్ల రూపాయలను వేట నిషేధిత కాలం భృతి క్రింద ఒక్కో లబ్ధిదారునికి 20,000 సొమ్మును మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం తో పోలిస్తే కూటమి ప్రభుత్వం రెట్టింపు భృతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story