ఉత్తరాంధ్ర ప్రగతిలో మరో మైలురాయి.. రాంబిల్లిలో భారీ మెగా బ్యాటరీ ప్లాంట్...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-17 08:49:12  IST  )

రాష్ట్రాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది....

ఉత్తరాంధ్ర ప్రగతిలో మరో మైలురాయి..  రాంబిల్లిలో భారీ మెగా బ్యాటరీ ప్లాంట్...!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం(Coalition Government) తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ప్రగతిలో ఉత్తరాంధ్ర(Uttarandra)కు పెద్ద వేస్తోంది. ఇప్పటికే పలు పరిశ్రమలను తీసుకొచ్చింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి వేదికగా రూ. 8,175 కోట్ల భారీ పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్(lithium ion battery manufacturing unit) ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతికతతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనుంది. భవిష్యత్‌ ఇంధన అవసరాలకు వెన్నెముకగా నిలపడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. పర్యావరణ హితమైన ఇంధన వనరుల తయారీలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా...

అయితే ఈ మెగా ప్రాజెక్టు కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతం కానుందని తెలిపింది. స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతపై శిక్షణ, ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది. రాంబిల్లిలో అడుగుపెట్టబోతున్న ఈ దిగ్గజ యూనిట్ ప్రాంతీయ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించనుందని ప్రభుత్వం పేర్కొంది.

Next Story