రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. అత్యధికంగా ఆ జిల్లాలోనే!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు(Liquor sales) భారీగా పెరిగాయి.

రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. అత్యధికంగా ఆ జిల్లాలోనే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు(Liquor sales) భారీగా పెరిగాయి. ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా పై దృష్టి సారించింది. ఈ కారణంగా మద్యం సేల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా ఎక్సైజ్‌ శాఖ(Excise Department) పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు రూ.30 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం.

2024-25లో సగటున రోజుకు రూ.83.38 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. అయితే కూటమి ప్రభుత్వం(AP Government) లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు(Liquor sales) పెరిగిన.. రాబడి పెద్దగా లేదనే చెబుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించింది. విలువ మాత్రం 0.34 శాతమే పెరిగింది. ఇక మద్యం అమ్మకాలు ఎక్కువగా కర్నూలు జిల్లాలో జరిగాయి. అత్యల్పంగా కడప జిల్లాలో జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, నాటు సారా నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఆదేశాలు జారీ చేశారు.

Next Story