- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala Updates: భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. టోకెన్ లేని సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు!

దిశ, వెబ్ డెస్క్: వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్ధీ భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తుల పోటెత్తారు. వీకెండ్ ప్రారంభం కానుండటంతో దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్‌లు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం ఎలాంటి టైం స్లాట్ దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం (Free Darshan) లభించడానికి సుమారు 24 గంటల (ఒక రోజంతా) సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.
ఇక నిన్న (గురువారం) ఒక్కరోజే మొత్తం 62,925 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య 36,297 గా నమోదైంది. కాగా, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా తిరుమల హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లుగా వచ్చినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. కంపార్టుమెంట్లలో మరియు క్యూలైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.






