రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఆ రోజే ఆఖరి తేదీ!

by Jakkula.Mamatha |

జిల్లాలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన అర్హులైన రైతుల నుంచి రైతు భరోసా పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఆ రోజే ఆఖరి తేదీ!
X

దిశ,మహాబూబాబాద్ ప్రతినిధి: జిల్లాలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన అర్హులైన రైతుల నుంచి రైతు భరోసా పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 15-06-2026 నాటికి భూ భారతి/ధరణి ఆధారంగా కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు మాత్రమే ఈ అవకాశానికి అర్హులని పేర్కొన్నారు.

దరఖాస్తుతో పాటు ఈ పత్రాలను సమర్పించాలి..

పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్,

ఆధార్ కార్డు జిరాక్స్,

బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్ లీఫ్ జిరాక్స్,

రైతు భరోసా దరఖాస్తు

అవసరమైతే బ్యాంక్ ఖాతా సవరణ దరఖాస్తు.

సంబంధిత క్లస్టర్ రైతు వేదికల్లో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు(AEO) వద్ద జూన్ 30, 2026 లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే రైతు భరోసా పథకంలో నమోదైన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే వచ్చే నెలలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ కూడా ఉండనున్న నేపథ్యంలో రైతులు రైతు బీమా దరఖాస్తు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్ తదితర పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Next Story