- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో భారీ జీఎస్టీ స్కామ్! రూ. 11.54 కోట్ల ఎగవేత.. నిందితుడి అరెస్ట్
నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టిన ఓ వ్యక్తిని కేంద్ర జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ నగరంలో భారీ జీఎస్టీ పన్ను ఎగవేత గుట్టురట్టయింది. నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టిన ఓ వ్యక్తిని కేంద్ర జీఎస్టీ (CGST) అధికారులు అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సీజీఎస్టీ యాంటీ-ఎవేషన్ విభాగం అధికారులు నగరంలో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నిందితుడు ఏకంగా రూ. 81.25 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రూ. 11.54 కోట్ల పన్నును ఎగవేసినట్లు నిర్ధారించారు.
సోదాలు - కీలక ఆధారాలు.. 14 రోజుల రిమాండ్
ఈ కేసుకు సంబంధించి నిందితుడి నివాసంతో పాటు, సంబంధిత సంస్థల కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు.






