- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News:టెన్త్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి(10th Class) విద్యార్థుల(Students) భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్ష(Exams)లకు సిద్ధం అవుతుండగా, సెలవుల్లో కూడా వారికి మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రభుత్వ భోజనం అందించే విధానం అమల్లోకి రానుంది. ఈ వ్యవధిలో రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ(Education Department)కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ నిర్ణయం ప్రధానంగా పరీక్షల సమయాల్లో విద్యార్థులకు కలిగే ఒత్తిడి(Stress)ని తగ్గించడం కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ పరిస్థితులు సరిగా లేని విద్యార్థులకు ఇది మరింత ప్రోత్సాహం కలిగించనుంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల వద్ద సూచనలు పొందగలుగుతారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కట్టుబడి ఉంది. దీని ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వారికి విద్యలో మరింత మక్కువ పెరగేలా చేయడమే లక్ష్యం. రీక్షల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






