- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో గ్రామంలోనూ మెలియాయిడోసిస్ లక్షణాలు.. భారీగా పెరుగుతున్న ఫీవర్ కేసులు.. గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది?
గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల సంభవించిన అనివార్య మరణాలు ఆ గ్రామాన్నంతటినీ భయాందోళనలకు గురిచేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల సంభవించిన అనివార్య మరణాలు ఆ గ్రామాన్నంతటినీ భయాందోళనలకు గురిచేశాయి. గ్రామంలో ఏదో పీడ పట్టుకుందన్న మూఢనమ్మకం మొదలైంది. ఆ గ్రామంలో మరణాలకు కారణం మెలియాయిడోసిస్ అని తేల్చిన వైద్యులు.. ఆ లక్షణాలున్నవారికి చికిత్స చేస్తున్నారు. మరోవైపు అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న బొడ్రాయి పక్కకు జరగడంతోనే ఈ అరిష్టం పట్టుకుందంటూ.. బొడ్రాయికి జలాభిషేకం చేసి.. పూజలు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ.. జిల్లాలోనే మరో గ్రామంలో జ్వరాల కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జ్వరాల కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని చేబ్రోలు పీహెచ్ సీ డాక్టర్ ఊర్మిళ తెలిపారు. ఫీవర్ కేసులు పెరిగిపోతుండటంతో.. బాధితులకు బ్లడ్ కల్చర్ టెస్టులు చేయగా.. ఐదుగురికి స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్ గా తేలిందని వివరించారు. మరొకరికి మెలియాయిడోసిస్ నిర్థారణ అవ్వగా.. మరిన్ని టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్స్ ను గుంటూరు జీజీహెచ్ కు పంపినట్లు చెప్పారామె. అయితే వీటిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా.. చేబ్రోలుకు చెందిన ఆశావర్కర్ సులోచన (45) జ్వరం, ఉబ్బసం లక్షణాలతో ఈనెల 12న మరణించడంతో.. ఆమె మరణంపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఆమె బ్లడ్ టెస్ట్ రిపోర్టుల్ని డాక్టర్లు మరోసారి పరిశీలిస్తున్నారు.






