ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంటనష్టం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-29 09:56:05  IST  )

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి పంటలు చేతికొచ్చే సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంటనష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి పంటలు చేతికొచ్చే సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలు కంటనీరు బిగపట్టుకుని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వరి పంట పడకేసింది. తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.

కోనసీమలో వరి, అరటి పంటల రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లింది. రాజోలు, పి. గన్నవరం, రావులపాలెం, చాకలిపాలెం, కనకాయలంక గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లా జామి మండలంలో పంట చేతికి వచ్చే సమయంలో వరిపంట నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో వేరుశెనగ, పొగాకు, మిర్చి పంటలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

READ MORE .....

రైతులెవ్వరూ అధైర్యపడొద్దు : మంత్రి వాసంశెట్టి సుభాష్

Next Story