BREAKING: తిరుపతి అలిపిరి వద్ద భారీగా నగదు పట్టివేత.. పోలీసుల అదుపులో వ్యక్తి

by Ramesh Naini |

టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో కారులో తరలిస్తున్న సుమారు రూ. 60 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

BREAKING: తిరుపతి అలిపిరి వద్ద భారీగా నగదు పట్టివేత.. పోలీసుల అదుపులో వ్యక్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో కారులో తరలిస్తున్న సుమారు రూ. 60 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. భారీ నగదుతో ఓ వ్యక్తి కారులో తిరుమలకు వెళ్తుండగా తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు బయటపడింది. దీనిపై సదరు వ్యక్తిని అధికారులు ప్రశ్నించగా.. తిరుమలలో నాణేలు (కాయిన్స్) తీసుకోవడం కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, సరైన పత్రాలు లేకుండా అంత భారీ మొత్తంలో నగదు ఉండటంతో విజిలెన్స్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం సదరు వ్యక్తి అలిపిరి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ నగదుకు సంబంధించిన అసలు యజమాని ఎవరు? అంత భారీ మొత్తాన్ని తిరుమలకు ఎందుకు తీసుకెళ్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story