- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడేపల్లిలో భారీ కారు తాకట్టు మోసం.. అద్దెకు తీసుకుని, డబ్బులు గుంజుకుని..
తాడేపల్లిలో భారీ కారు తాకట్టు మోసం బయటపడింది. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని,

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో భారీ స్థాయిలో కార్ల తాకట్టు మోసం వెలుగులోకి వచ్చింది. అద్దెకు కార్లను తీసుకుని, వాటిని ఇతరులకు తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా బాగోతం పోలీస్ కంప్లైంట్ తో వెలుగులోకి వచ్చింది.
అద్దె కారుతో అసలు కథ మొదలు
నూజివీడుకు చెందిన బానోత్ భవాని, కనకమేడల భాస్కర్ అనే వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడ్డారు. ఉండవల్లికి చెందిన ఒక వ్యక్తి వద్ద కారును అద్దెకు తీసుకున్న వీరు, ఆ వాహనాన్ని గురజాలకు చెందిన వెంకట రమణయ్య వద్ద 3 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టారు. ఇదే పద్ధతిలో నిందితులు సుమారు 7 కార్లను అద్దెకు తీసుకొచ్చి వెంకట రమణయ్య వద్ద ఉంచినట్లు సమాచారం. కార్ల యజమానులు తమ వాహనాల కోసం నిందితులను సంప్రదించగా, వారి అసలు రంగు బయటపడింది. వాహనాలకు ఉన్న GPS (జిపిఎస్) పరికరాలను తొలగించి, కార్లను గుర్తుతెలియని ప్రదేశాలకు తరలించారు. అటు వాహనాలను తాకట్టు పెట్టుకున్న వెంకట రమణయ్య కూడా, "తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తేనే కార్లను వదులుతాను" అని బాధితులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు నిందితులు భవాని, భాస్కర్‌లపై FIR నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.






