- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్నాకులం రైలు ప్రమాదం.. మృతుని బ్యాగులో భారీగా బంగారం, డబ్బు
by Muthe.Rajitha |
ఎర్నాకుళం రైలుకు సోమవారం ఉదయం మంటలు అంటుకొని ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎర్నాకుళం రైలుకు సోమవారం ఉదయం మంటలు అంటుకొని ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో ఈ ఘటన జరగగా రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ 70 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమై మృతి చెందారు. ప్రమాదం అనంతరం రైల్వే పోలీసులు మృతుడికి చెందిన బ్యాగును గుర్తించారు. కుటుంబసభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా అందులో భారీగా డబ్బు, బంగారు నగలు బయటపడ్డాయి. దాదాపు రూ.5.80 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించగా..అయితే మంటల కారణంగా చాలా నోట్ల కట్టలు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Next Story






